డ్రాగన్ దేశం చైనా పై ఇండియా డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ ను కొనసాగిస్తుంది.
గతంలో గాల్వన్ లోయ లో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో టిక్ టాక్,హలొ యాప్ లతో సహా మొత్తం 59 చైనీస్ యాప్ లపై నిషేధం విధించిన కేంద్ర సర్కార్ ఇప్పుడు తాజాగా మరో 117 యాప్ లపై నిషేధం విధించినట్లు తెలుస్తుంది.
గతంలో చోటుచేసుకున్న గాల్వన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ తో సహా 20 మంది ప్రాణాలు కోల్పోన విషయం తెలిసిందే.
ఈ ఘర్షణల నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఆ సమయంలో కీలక నిర్ణయం తీసుకొని ఆ దేశానికి చెందిన యాప్ లపై నిషేధం విధించింది.
అయితే తాజాగా మరోసారి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఆ దేశానికి చెందిన మరో 118 యాప్ లపై కూడా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
పబ్జీ సహా 118 యాప్‌లపై నిషేధం విధించింది.పబ్జీ మొబైల్ నార్డిక్ మ్యాప్: లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వియ్‌చట్ వర్క్, వియ్‌చాట్ రీడింగ్, బైడూ, బైడూ ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, మెసేజ్ లాక్, స్మార్ట్ యాప్ లాక్, యూ-డిక్షినరీ, వీపీఎన్ ఫర్ టిక్ టాక్ తదితర యాప్‌లు నిషేధిత యాప్‌ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది.
వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన నార్నె నితిన్.. ఈ యంగ్ హీరోకు తిరుగులేదుగా!