కిషన్ రెడ్డి ని చంపేస్తామంటూ బెదిరింపులు...సైబర్ పోలీసులకు ఫిర్యాదు

కేంద్ర హోం సహాయక మంత్రిగా కిషన్ రెడ్డి ఇటీవల భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది.దీనితో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గత నెల 20న ఇంటర్‌నెట్‌ వాయిస్‌కాల్స్‌ ద్వారా కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారని ఈ మేరకు ఫిర్యాదు అందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

కిషన్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్‌ రావడంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచి నిఘా పటిష్టం చేసినట్లు తెలుస్తుంది.

మరోపక్క కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు ఎక్కడి నుంచి ఇంటర్నెట్ వాయిస్ కాల్ వచ్చిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడా కిషన్ రెడ్డికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర సహాయమంత్రి హోదా లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.