బాక్సింగ్ లో ప్రపంచ చాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్ కు నా అభినందనలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
TeluguStop.com
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.దేశంలో ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఎండ వేడిమికి పక్షులు ఆకలి దప్పులకు గురవుతూ నీరు లేక అవస్థలు పడుతున్నాయి.
పక్షులకు నీటి సౌకర్యం కలిగేలా తగిన ఏర్పాట్లు ఇళ్లల్లో చేసి ప్రజలంతా సహకరించాలి.
ఇవాళ పక్షులకు నీటిని అందివ్వడానికి ప్రజలకు తగిన పాత్రలు అందివ్వడం జరిగింది.పక్షుల ప్రాణాలు కాపాడే విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలి.
మన ఆడ బిడ్డలు క్రీడల్లో రానిస్తున్నారు.సింధు, మెరికొమ్ వంటి మహిళలు యిప్పటికే అంతర్జాతీయ వేదికలపై భారతీయ క్రీడాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పారు.
బాక్సింగ్ లో ప్రపంచ చాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్ కు నా అభినందనలు.
ప్రధాని నరేంద్ర మోడీగారు క్రీడాకారులకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు.జరీన్ కు ముందు ముందు అన్ని రకాల సహకారం అందిస్తూ ఆమె మరింత ముందుకు వెళ్ళడానికి తోడ్పాటు అందిస్తాం.
బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్.. బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!