కార్వాన్ నియోజికవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..
TeluguStop.com
హైదరాబాద్: కార్వాన్ నియోజికవర్గంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోయే యువతతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా గంటపాటు వారితో ముచ్చటించారు.
విద్యార్థులతో అడిగి వారి యొక్క లక్ష్యాలు వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి తెలుసుకున్నారు.
విద్యార్థులు మంత్రిని స్వాగతించిన తీరు ఎంతగానో అలరించిందని ఆయన అన్నారు.నేటి యువతకి భవిష్యత్తు పైన ఎన్నో ఆశయాలు ఉన్నాయని వారి కళలను నెరవేర్చేందుకు నరేంద్ర మోదీ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ యువత కోసం అమలులోకి తెచ్చిన పథకాలు నేటి యువతకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
ఇదేందయ్యా ఇది.. పొలిటికల్ సైన్స్ డిగ్రీతో వైద్యుడు ఎలా అయ్యాడబ్బా?