ప్రధాని నుండి రేపు మరో కీలక ప్రకటన

నేడు ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది.ఇప్పటికే పలు కంపెనీలు మూత పడ్డాయి.

మరెన్ని కంపెనీలు జాడా పత్తా లేకుండా పోతాయో అని, దాంతో ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు లేకుండా పోతారో అంటూ విశ్లేషకులు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో కేంద్ర మంత్రి ప్రకాష్‌ జయదేకర్‌ ఆసక్తికర ప్రకటన చేశారు.

రేపు ప్రధాని నరేంద్ర మోడీ నుండి కీలక ప్రకటన రాబోతున్నట్లుగా ప్రకటించాడు.ఏప్రిల్‌ 20వ తారీకు తర్వాత లాక్‌డౌన్‌ విషయమై రాష్ట్రాలతో చర్చించబోతున్నారు.

ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానుసారం కొన్ని రకాలుగా లాక్‌డౌన్‌లో సడలింపులు చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

మాస్టర్‌ ప్లాన్‌ను సిద్దం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ విషయంలో రేపు ఒక ప్రకటన చేస్తాడని మంత్రి పేర్కొన్నారు.

దాంతో ఆర్థిక పరమైన ప్రకటన అయ్యి ఉంటుందా అంటూ రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పేదలు తిండి కూడా లేకుండా అవస్థలు పడుతుండగా ఈ సమయంలో మోడీ నుండి ఆర్థిక ప్యాకేజీ తప్పనిసరి అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!