కరోనా బాధితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని లక్షణాలు ఉంటాయని.
వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. """/"/
అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు.
ఇక కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.వ్యాయామం చేయాలని, పోషకాహారం తీసుకోవాలని చెప్పారు.
అలాగే కరోనా నుంచి కోలుకున్నవారు గుండె పని తీరుతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పరీక్షించుకోవాలని కేంద్రం స్పష్టం చేశారు.
అదేవిధంగా, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలని సూచనలు చేసింది.వీటితో పాటు కరోనా నుంచి కోలుకున్నా సరే మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెంట్స్ పాటించడం ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఏకంగా 2కోట్ల 89లక్షలు దాటేసింది.
ఇక కరోనా మరణాల విషయానికి వస్తే.9లక్షల 24వేలు మించిపోయాయి.
అయితే రికవరీ అయిన వారి సంఖ్య సైతం భారీగానే పెరుగుతుండడం విశేషం.
ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు .. సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు