రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం ఎంతంటే.. !
TeluguStop.com
ఏపీ తెలంగాణాల రాష్ట్రాలకు కేంద్రం తాజాగా జీఎస్‌టీ పరిహారం విడుదల చేసింది.ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది ఏం లేదని వాదిస్తున్న నాయకులు, కేంద్రం నుండి తెచ్చుకుంటున్న నిధులు ఏం చేస్తున్నారో? ఎక్కడ అభివృద్ధి పనులకు ఊపయోగిస్తున్నారో? అనే తికమకలో ప్రజలు ఉన్నారట.
అదీగాక అసలు కేంద్రం తెలంగాణాకు ఇచ్చింది ఏం లేదని టీఆర్ఎస్ నేతలు తెగ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు 17వ విడతలో భాగంగా ఈ పరిహారం విడుదల చేసింది.
"""/"/
ఇకపోతే ఆర్థిక మంత్రిత్వశాఖ మొత్తం రూ.5వేల కోట్లు శుక్రవారం విడుదల చేయగా ఇందులో తెలంగాణకు రూ.
1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.
2222.71 కోట్లు చెల్లించింది.
కాగా ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
కాగా రెండు రాష్ట్రాల లోటును 91శాతం భర్తీ చేశామని చెప్పింది.ఇకపోతే కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.
91,460.34 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.
8,539.66 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
గౌతమ్ తిన్ననూరి కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు…