వాహనాలు లైసెన్సు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!

లైసెన్స్ జారీ విషయంలో మొన్నటి వరకూ టెస్ట్ డ్రైవింగ్ ఉండేది అని అందరికి తెలుసు.

కానీ తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అలాంటివి ఏమీ లేకుండా లైసెన్సులు జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ డిసైడ్ అయ్యింది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా శుక్రవారం విడుదల చేయడం జరిగింది.ఇదిలా ఉంటే పౌరులకు నాణ్యతతో కూడిన శిక్షణా కేంద్రాలు అందించడానికి డ్రైవర్ శిక్షణా కేంద్రానికి నిర్దిష్టమైన అర్హతలతో కూడిన ముసాయిదాను తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదించడం జరిగింది.

ఈ కేంద్రాల్లో ఎవరైతే డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటారో వారికి మాత్రమే టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే రీతిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఈ నిర్ణయంతో రవాణా పరిశ్రమకు సురక్షితమైన డ్రైవర్లు అందించినట్లు అవుతుందని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించినట్లు అవుతుందని రవాణా మంత్రిత్వ శాఖ ఈ విధంగా ఆలోచన చేసింది.

బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్