14 యాప్స్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ యాప్స్ ఎంత ప్రమాదకరమో తెలుసా..?

తాజాగా కేంద్ర ప్రభుత్వం( Central Govt ) 14 యాప్స్ ను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై భారతదేశంలో ఈ 14 యాప్స్ అందుబాటులో ఉండవు.ఈ యాప్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కావున తమ ఫోన్లలో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసుకోవడం బెటర్.

ఈ 14 యాప్స్ అన్ని మెసెంజర్ యాప్సే.( Messenger Apps ) దేశ భద్రతను కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కొంతమంది టెర్రరిస్టులు ( Terrorists ) ఈ యాప్స్ ద్వారా మెసేజెస్ పంపుతూ.

భారత దేశంలోకి చొరబడడం, భారతదేశంలో తమకు కావాల్సిన సమాచారం పొందడం, ముఖ్యంగా వివిధ దాడులకు పాల్పడడం కోసం ఈ యాప్స్ ఉపయోగిస్తున్నారు.

"""/" / ఈ యాప్స్ ద్వారా భారత దేశంలోని సమాచారం పాకిస్తాన్ కు మెసేజ్ రూపంలో వెళ్తున్నాయని భారత కేంద్ర ప్రభుత్వం ఈ యాప్స్ ను బ్లాక్ చేసేసింది.

బ్లాక్ చేసిన యాప్స్ ఏంటంటే.ఎనిగ్మా, సేఫ్ స్విస్, విక్ మి, క్రిప్విజర్, మీడియా ఫైర్, బ్రెయార్, సెకండ్ లైన్, జంగి, థ్రిమా, బీచాట్, నాండ్ బాక్స్, కొని ఆన్, ఐఎంవో, ఎలిమెంట్ అనే యాప్స్ ను నిషేధించింది.

"""/" / కాశ్మీర్ ప్రాంతంలో ఈ యాప్స్ ఎక్కువగా వాడుతున్నట్లు సమాచారం.టెర్రరిస్టులు తమ మద్దతుదారుల ద్వారా మెసేజెస్ పంపిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.

కాబట్టి భారతదేశంకు ఈ 14 యాప్స్ ద్వారా ఎప్పటికైనా ప్రమాదమే.కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా ఇప్పటికే పలు యాప్స్ ను కూడా నిషేధం విధించింది.ఇక స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కచ్చితంగా ఏవైనా యాప్స్ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం.

థర్డ్ పార్టీ స్టోర్స్ లేదా బ్రౌజర్ ద్వారా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఇబ్బందులు పడాల్సిందే.

ఫోన్ హ్యాక్ కావచ్చు లేదంటే ఫోన్లో ఉండే విలువైన సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కవచ్చు.

కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుంటే మంచిది.

విషాదం: యువ మహిళా సినీ నిర్మాత ఆత్మహత్య..