తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ నోటీసులు జారీ చేసింది.ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై మండిపడుతోంది.

దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.

ఈ మేరకు రెండు రోజుల్లోపు నిధులు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.లేని పక్షంలో తదుపరి వాయిదాలను నిలిపివేస్తామని కేంద్రం హెచ్చరించినట్లు సమాచారం.

జూన్ నెలలో తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం నిధులను అనుమతి లేని పథకాలకు మళ్లించినట్లు గుర్తించింది.

వైరల్ వీడియో: గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన గ్యాంగ్..