కీలక ఘట్టానికి తెర లేచిన ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ.. !
TeluguStop.com
ఇప్పటికే దేశంలో ఉన్న పలు సంస్దలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక ఘట్టానికి తెర లేపింది.
ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా లో 100 శాతం వాటా విక్రయం కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది.
కాగా కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నదట.
ఇకపోతే గతేడాది డిసెంబర్‌లో జరిగిన ప్రాథమిక బిడ్ల ప్రక్రియలో టాటా గ్రూప్ తో సహా పలు సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి.
వీటిని పరిశీలించిన తర్వాత అర్హులైన పెట్టుబడిదారుల సందేహాలను వర్చువల్ పద్ధతిలో తీరుస్తామని కేంద్రం తెలియచేస్తుంది.
కాగా దీన్ని కొనుక్కునే సంస్థకు 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లు లభిస్తాయి.
విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్లు దక్కుతాయి.2017లోనే ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియ ప్రారంభమైనా ఆ సంస్థకున్న రూ.
60,074 కోట్ల అప్పులను పూర్తిగా భరించాలన్న నిబంధన కారణంగా ఏ కంపెనీ ముందుకు రాలేదు.
ఇక ఎయిర్ ఇండియా ను 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేసినప్పటి నుంచి నష్టాలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఏయిర్ ఇండియా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం వెల్లడిస్తుంది.
డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నిర్మాత నాగవంశీ క్రేజీ కామెంట్స్ వైరల్!