మీకు తెలుసో లేదో… ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనుకొనేవారికి కేంద్రం రూ.1.5 లక్షలు?

కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్( Electric Vehicle ) కొనాలని అనుకునేవారికి ఈ విషయం తెలుసో లేదో గాని ఈ విషయాన్ని ఒక్కసారి గమనించండి.

సాధారణంగా అంటే దాదాపుగా కరోనా మహమ్మారి తరువాత మోటార్ ఫీల్డులో పెను మార్పులే సంభవించాయని చెప్పుకోవచ్చు.

నిత్యావసర ధరలు ఆకాశన్నంటడడంతో, మరీ ముఖ్యంగా ఆయిల్ ధరలు( Fuel Rates ) కొండెక్కి కూర్చోవడంతో జనాలు ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లారు.

అది గమనించిన కొన్ని సో కాల్డ్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్ తయారీని తయారు చేయడంలో బిజీ అయిపోయాయి.

"""/" / కట్ చేస్తే నెలల వ్యవధిలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో దర్శనం ఇచ్చాయి.

దాంతో కొంతమంది జనాలు వాటిని బాగానే కొనుగోలు చేసారు.అయితే దిగువ మధ్య తరగతి వారు మాత్రం వాటిని కొనే సాహసం చేయలేక పాత తుప్పుపట్టిన పెట్రోల్, డీజిల్ బళ్లనే ఇంకా వాడుతున్నారు.

ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికొస్తే ఇవి సాధారణ వెహికల్స్ కంటే కాస్త ధర ఎక్కువగా కలిగి ఉండడమే.

ఇపుడు అలాంటివారి కోసం కేంద్రం ఒక శుభవార్తను తీసుకువచ్చింది.ఈ నెల చివరి కల్లా మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే.

అదిరిపోయే బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. """/" / ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుపై పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు.

అంటే ఏకంగా ఇక్కడ రూ.1.

5 లక్షల వరకు ఈ బెనిఫిట్ పొందవచ్చు.అందువల్ల మీరు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొనే యోచనలో ఉంటే ఆ పని వెంటనే చేసేయండి.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద మీరు ఈ ప్రయోజనం సొంతం చేసుకోవచ్చు.

అయితే లోన్ ( Loan ) తీసుకొని ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.

2023 మార్చి 31లోపు మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుకు లోన్ పొంది ఉండాలి.

అప్పుడే మీకు రూ.1.

5 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది.దానికోసం మీరు కేవలం ఈవీలను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఆరో రోజు కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన దేవర.. ఏకంగా అన్ని రూ.కోట్లు వచ్చాయా?