కోవిడ్ మరణాలను కప్పిపుచ్చుతున్న కేంద్ర ప్రభుత్వం

కోవిడ్ మరణాలను కప్పిపుచ్చుతున్న కేంద్ర ప్రభుత్వం

నల్గొండ జిల్లా:భారత దేశంలో కోవిడ్ మరణాలను కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతుందని యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు పుట్ట రాకేష్ ముదిరాజ్ ఆరోపించారు.

కోవిడ్ మరణాలను కప్పిపుచ్చుతున్న కేంద్ర ప్రభుత్వం

మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత దేశంలో 47 లక్షల మంది కరోనా బారినపడి మరణించారని డబ్ల్యూ హెచ్ ఓ నివేదిక చెబుతుంటే మోడీ బీజేపీ ప్రభుత్వం మే 6వ తేదీన సెంట్రల్ రిజిస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కేవలం 5 లక్షల మంది మరణించారని తప్పుడు లెక్కలు చూపిస్తుందని దుయ్యబట్టారు.

కోవిడ్ మరణాలను కప్పిపుచ్చుతున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు సరైన వైద్యం అందిచకపోవడంతో దేశంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం 4,111 అని నివేదిక సమర్పించింది కానీ,హిందూ పేపర్ నివేదిక ప్రకారం కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో లక్ష పైగా ఉండొచ్చని అంచనా వేసిందన్నారు.

రాష్ట్రం మొత్తంలో తమకు ఉన్న సమాచారం ప్రకారం 2.5 నుండి 3 లక్షల వారికి ఉండచ్చని అన్నారు.

ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ కనగల్ మండల యూత్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు గుండెబోయిన రాంబాబు,కుంటిగొర్ల కృష్ణ,చంద్రశేఖర్,మోహన్, హరికృష్ణ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పెళ్ళాం ప్లాన్ ఫ్లాప్.. నిద్రపోతున్న మొగుడి ఫోన్ అన్‌లాక్ చేయబోతే సీన్ రివర్స్.. వీడియో చూస్తే నవ్వాగదు..

పెళ్ళాం ప్లాన్ ఫ్లాప్.. నిద్రపోతున్న మొగుడి ఫోన్ అన్‌లాక్ చేయబోతే సీన్ రివర్స్.. వీడియో చూస్తే నవ్వాగదు..