కేంద్ర బలగాలు కీలక పాత్ర పోషిస్తాయి – డీఎస్పీ ఉదయ్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ధైర్యంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి ఆటంకాలు ప్రజలకు కలగకుండా కేంద్ర బలగాలు కంటికి రెప్పలా కాపాడుతాయని డి.

ఎస్.పి ఉదయ్ రెడ్డి( DSP Uday Reddy ) అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( Akhil Mahajan )ఆదేశాల మేరకు డి.

ఎస్.పి ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో బి ఎస్ ఎఫ్ జిల్లా పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చు నిర్వహించారు.

అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో పాటు గొల్లపల్లి,బొప్పాపూర్ గ్రామాలలో జిల్లా పోలీసు సిబ్బందితో నడుచుకుంటూ వెళ్లారు.

ఈ సందర్భంగా ఉదయ్ రెడ్డి( DSP Uday Reddy ) మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే తమ బాధ్యత అనిపేర్కొన్నారు.

ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల నందు సాయుధ బలగాలతో కూడిన బిఎస్ఎఫ్ సిబ్బంది( BSF ) విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు.

ఈ ఫ్లాగ్ మార్చ్ లో సిఐ శశిధర్ రెడ్డి,ఎస్సై రమాకాంత్, పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యూకే పార్లమెంట్‌లో భారత సంతతి నేత ప్రీతి పటేల్‌కు కీలక పదవి