నేటితో ఎన్నికల కోడ్ కు శుభం కార్డు…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది.
ఇలా ఏడో విడతల్లో పోలింగ్ జరిగింది.జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ్టితో సార్వత్రిక ఎన్నికల కోడ్ అన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల నియమావళి ముగియనుంది.
ఈరోజు జూన్ 5వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కోడ్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోనుంది.
ఇక కోడ్ ఎత్తివేసిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్న విషయం తెలిసిందే.