కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ఎన్నిక..!

కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ను ఎన్నుకున్నారు.అశోక్ లవాసా రాజీనామా చేయడంతో పోస్టు ఖాళీ ఏర్పడింది.

దీంతో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.

ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన రాజీవ్ కుమార్ గత నెలలోనే ఆ పదివికి రాజీనామా చేశారు.

ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన అశోక్ లవాసా స్థానంలో ఈ రోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు.

రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి.

అనేక రంగాల్లో విధులు నిర్వహించారు.పబ్లిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో 30 ఏళ్ల అపార అనుభవాన్ని సంపాదించుకున్నారు.

ఎడ్యూకేషన్ విషయంలో ఆయన మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్ఎల్ బీ డిగ్రీ పట్టాను కూడా పొందారు.

పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్ బీ) లో ఆయన ఆసియా అభివృద్ధి బ్యాంకుకు చైర్మన్ గా కొనసాగారు.

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడంతో ఏప్రిల్ 29వ తేదీన ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు.

అశోక్ లవాసా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన బాలయ్య…