ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్ని కల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ఏ సబ్ సెక్షన్(1) ప్రకారం అధికారం నుపయోగించి సబ్ సెక్షన్( 2) ననుసరించి ఈ నెల నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30న సాయంత్రం 6.
30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించినట్లు తెలిపారు.ఎవరైనా వ్యక్తులు లేదా పార్టీలు ఎగ్జిట్ పోల్ నిర్వహించడం,ఫలితాల వివరాలను వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం ,
ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రసారం చేయడం,ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం వంటివి నిషేధించి నట్లు తెలిపారు.
ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించినా ఎల క్టోరల్ చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయని హెచ్చరించింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 1(బి ) ప్రకారం సాధారణ ఎన్నికలలో పోలింగ్ ముగిసే సమయం నవంబర్ 30 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముందు 48 గంటలు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల సమాచారం, ఒపీనియన్ పోల్స్,లేదా ఇతర పోల్ సర్వేల ఫలితాలను ప్రదర్శించడం పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించినట్లు ఆయన ఈ ప్రకటన లో తెలిపారు.
లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?