కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర కేబినెట్ భేటీ జ‌రిగింది.ఈ స‌మావేశంలో కేబినెట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

పీఎం శ్రీ పేరుతో మోడ‌ల్ స్కూళ్లు ఏర్పాటు చేయాల‌న్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

దీంతో దేశవ్యాప్తంగా 14 వేల పీఎం శ్రీ మోడ‌ల్ స్కూళ్లను నిర్మించ‌నున్నారు.18 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది.

ఐదేళ్ల‌లో రూ.27,360 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉన్న‌ట్లు తెలిపింది.

అనుభ‌వాలు, ప్రాక్టిక‌ల్స్ ఆధారంగా విద్యాబోధ‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నుండగా.కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌డిపే స్కూళ్ల నుండి పీఎం శ్రీ మోడ‌ల్ స్కూల్ కు ఎంపిక చేయ‌నున్నారు.

అదేవిధంగా రైల్వే శాఖ‌లో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రైల్వే భూములు ఇచ్చేందుకు స‌ముఖ‌త వ్యక్తం చేసింది.

ఐదేళ్ల‌లో 300 కార్గో టెర్మిన‌ల్స్ ను కేంద్రం నిర్మించ‌నుంది.అలానే, పీపీపీ ప‌ద్ధతిలో రైల్వే భూముల‌ను ఆస్ప‌త్రులు, కేంద్రీయ విద్యాల‌యాల ఏర్పాటుకు ఇవ్వాల‌ని మంత్రివ‌ర్గం ఆమోదించింది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య…