తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సమ్మక్క -సారక్క ట్రైబల్ వర్సిటీకి ఆమోదం తెలిపింది.ఈ క్రమంలో మంత్రివర్గ నిర్ణయాలను కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

అదేవిధంగా ఏపీ - తెలంగాణకు కృష్ణా నీటి కేటాయింపులపై కూడా చర్చ జరిగిందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో కృష్ణా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా నీటి వాటాలపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది.

కాగా 2018లో ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకం కోసం తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కేంద్రం సూచనతో సుప్రీంలో పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది.

ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడంతో కొంతకాలంగా కేంద్రంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters