రైతులను అణిచి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల జిల్లా :కేంద్ర బిజెపి ప్రభుత్వం( BJP Govt ) అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఎండగట్టారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ , కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు.

కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా పంటలకు మద్దత్తు కల్పించకుండా రైతులను బిజెపి మోడీ ప్రభుత్వం( PM Modi ) మోసం చేసిందని అన్నారు.

రాబోయే ఎలక్షన్లో మా పార్టీ అధికారంలోకీ రాగానే హామీలన్నిటిని అమలు చేస్తామని రాహూల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని రైతులకు( Farmers ) స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య , మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడీ రాంరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగ మల్లారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేందర్ , ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ , మైనార్టీ అధ్యక్షులు ఎండి రఫీక్ బండ లింగంపల్లి ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ దేవయ్య , మండల కాంగ్రెస్ నాయకులు గంట బుచ్చ గౌడ్, అన్ని గ్రామాల శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

వేణుమాధవ్ కామెడీగా చెప్పిందే సినిమా తీసి హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ఏమైందంటే?