ప్రజలపై ధరల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి:ఆర్.ఎస్.పి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు,విద్యుత్,ఆర్టీసీ చార్జీలు పెంచి,పేదల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ,
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డా.
ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో 27 వ రోజు యాత్ర కొనసాగించారు.
ఈ సందర్భంగా యాత్ర కొనసాగే ప్రాంతాల్లో బీఎస్పీ జెండాలను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి,రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పండిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిరకాల ధరలు పెంచుతూ పేద,మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు.
అందుకే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రెండు ప్రభుత్వాలను రాబోయే ఎన్నికల్లో గద్దె దించి, బహుజన రాజ్యం కోసం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రాజు,నల్లగొండ జిల్లా,మిర్యాలగూడ నియోజకవర్గ నేతలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!