అధిక ధరను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం:మట్టిపెళ్లి

సూర్యాపేట జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు విమర్శించారు.

మంగళవారం మోతె మండల కేంద్రంలో సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అధిక ధరలను అరికట్టాలని,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరిసే విధంగా నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యు, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

పెరిగిన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్( Gas, Petrol, Diesel ) నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

అధికారానికి రాకముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశంలో అవినీతి, అక్రమాలు అరికడుతూ అవినీతి రహిత పాలన అందిస్తానని వాగ్దానం చేసిన మోడీ,దేశ సంపద మొత్తం ఆదాని,అంబానికి దోచిపెడుతూ ప్రజలపై అనేక భారాలు మోపుతున్నాడని ఆరోపించారు.

పసిపిల్లలు తాగే పాలు,పెరుగు చదువుకున్న విద్యార్థులపై పెన్నులు పుస్తకాలు, పెన్సిల్,చాకు పీసులపై జిఎస్టి విధించి ధరల భారం మోపుతున్నాడన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలు తెగనమ్మేస్తూ వెనకబడిన తరగతులకు షెడ్యూల్ కులాల,షెడ్యూలు తెగలకు రిజర్వేషన్ లేకుండా ఉపాధికి దూరం చేస్తున్నాడని విమర్శించారు.

కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా విభజించి కార్మికుల పొట్ట గొడుతున్నాడని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేస్తూ రైతులకు మాత్రం రుణాలు మాఫీ చేయడం లేదన్నారు.

ఇప్పటికైనా దేశ ప్రజలు బీజేపీ పరిపాలనలో జరుగుతున్న దురాగతాలను అర్థం చేసుకొని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భారతదేశాన్ని లౌకిక సెక్యులర్ దేశంగా కాపాడుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు గుంటగాని యేసు,చర్లపల్లి మల్లయ్య,సిపిఎం గ్రామ కార్యదర్శి దోసపాటి పెద్ద శీను,నాయకులు జిల్లపల్లి నాగయ్య,గురజాల నాగయ్య,అందెం వెంకటమ్మ,గురజాల వెంకన్న,మేకల పుష్ప, గురజాల సోమయ్య, తురక నాగమ్మ,గురజాల చిన్న వెంకన్న,దోసపాటి చిన్న శీను,గురజాల ఎల్లయ్య,బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?