వికలాంగుల పట్ల వివక్ష చూపిన కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ కేటాయింపులలో నిధుల కోతకు నిరసనగా ఎన్.

పి.ఆర్.

డి ఆద్వర్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.

ఈ సందర్బంగా ఎన్.పి.

ఆర్.డి యాదాద్రి జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారతకు 2024-25 బడ్జెట్లో 1225.

27 కోట్లు కేటాయించిదని,గత సంవత్సరం బడ్జెట్తో పోల్చితే 0.02 శాతం పెంచిందని,2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్ లో 5శాతం నిధులు కేటాయించాలన్నారు.

వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615.33కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు.

వికలాంగుల సహాయపరికరాల కొనుగోలు కోసం 315 కోట్లు కేటాయించారని,ఈ నిధులతో పరికరాలు అందరికి అందని ద్రాక్షగానే ఉంటుందని,దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకాన్ని అర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మాత్రం పెంచకుండా 165 కోట్లు కేటాయించిదని,2016 ఆర్పిడబ్ల్యుడి,నేషనల్ ట్రస్ట్,నేషనల్ పాలసీ, రెహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కీలక చట్టాల అమలుకు 135 కోట్లు కేటాయించడమంటే చట్టాల అమలు నుండి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడమే అవుతుందని, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మరియు వికలాంగుల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ కోసం గత సంవత్సరం 155 కోట్లు కేటాయించిగా ఈ సారి 142.

68 కోట్లు కేటాయించిందని,వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సాహస్తున్నామని ఒక వైపు చేప్పుతూ మరో వైపు నిధులు మాత్రం 76 కోట్ల నుండి 25 కోట్లకు తగ్గించడం జరిగిందన్నారు.

సమాజంలో అత్యంత వెనకబడిన వికలాంగుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతుందన్నారు.

ఇందిరా గాంధీ నేషనల్ డిసెబుల్డ్ పెన్షన్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.

2011నుండి కేవలం 300 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని,ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ ఎందుకు పెంచడం లేదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదన్నారు.

బడ్జెట్ ప్రసంగంలో వికలాంగుల ప్రస్తావన లేకపోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల పట్ల ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతుందన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో 5% నిధులు కేటాయించాల్సి ఉంటే ఒక్క పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు.

పెన్షన్ రూ.6 పెంచుతామని చెప్పి వికలాంగులను మోసం చేశారని ఆరోపించారు.

వికలాంగుల పరికరాలు, స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు.

వికలాంగుల విద్యా కోసం అవసరమైన నిధులు బడ్జెట్లో లేవన్నారు.వెంటనే బడ్జెట్ సవరించి 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు బలుగూరి ఆంజనేయులు, కార్యదర్శి గిరికల లింగుస్వామి,ఉపాధ్యక్షుడు నాగు నరసింహా,గట్ల రామిరెడ్డి, పున్నా శ్రీధర్,టి.

యాదగిరి, పరుశురాములు,పి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నరు.

నాపై కోపం తో మాట్లాడలేదు అనుకున్న.. ఏకంగా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు