కరోనాపై కేంద్రం హెచ్చరికలు.. తెలంగాణ సర్కార్ అప్రమత్తం
TeluguStop.com
కరోనాపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం కరోనాపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నారు.
బీఆర్కే భవన్ లో ఇప్పటికే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.అదేవిధంగా అన్ని జిల్లా ఆస్పత్రులను ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది.
ఈ మేరకు తెలంగాణలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్తగా నమోదయ్యే కరోనా కేసులను జీనోమ్ పరీక్షలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహిస్తుంది వైద్యారోగ్య శాఖ.అటు ఎయిర్ పోర్టు అధికారులు ప్రయాణికులకు విమానాల్లో మాస్క్ తప్పనిసరి చేశారు.
ఏం తెలివి గురూ.. ఎన్విడియా సీఈఓ తన భార్యను ఇలానే ప్రేమలో పడేశాడట..!