పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఆశ్చర్యకర ప్రకటన
TeluguStop.com
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఆశ్చర్యకర ప్రకటన చేసింది.పోలవరం నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ సమాధానం చెప్పింది.
పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తెలిపింది.
దీంతో తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఈ నేపథ్యంలోనే తొలిదశలో 20.946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైనట్లు కేంద్రం వెల్లడించింది.
ఇప్పటివరకు 11.677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు పేర్కొంది.
తొలిదశ సహాయ, పునరావాసం 2023 మార్చికే పూర్తి కావాల్సి ఉన్నా జాప్యం జరిగిందని వెల్లడించింది.
ఈ క్రమంలో పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం ఇచ్చారు.
హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!