రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర

నల్గొండ జిల్లా:పెద్దవూర మండల కేంద్రంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని బిసి యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రేపాకుల ఆంజనేయులు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కార్పోరేట్ వ్యవసను బలంగా నిర్మాణం చేస్తూ అణగారిన వర్గాలను పూర్తిగా నిర్వీర్యం చేసే పనిని భుజాలపై వేసుకున్నదని విమర్శించారు.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడం ఇందుకు సుప్రీం కోర్టు మద్దతు తెలపడం శోచనీయం అన్నారు.

బిసి జనగణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని,కేంద్రంలో టిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బిసిలను పూర్తిగా నిర్లక్షం చేస్తున్నాయని 2023 లో సార్వత్రిక ఎన్నికలలో బిసిల సత్తా ఏంటో చూపిస్తమని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకట్ నియోజకవర్గ అధ్యక్షుడు,కార్యదర్శులు మోర మధు యాదవ్, నకినలోయిన సతీష్ ముదిరాజ్,వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి వెంకట్ యాదవ్,విద్యార్థి సంఘం అధ్యక్షులు గోగు రమేష్ ముదిరాజ్,పి.

లాలయ గౌడ్,గణపురం శంకర్,కొండల్ మానన్ తదితరులు పాల్గోన్నారు.

పుష్ప 2 దెబ్బకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక్క రికార్డ్ కూడా మిగలదా..?