లోన్ యాప్ ల‌పై కేంద్రం సీరియ‌స్

చ‌ట్ట విరుద్ధ‌మైన లోన్ యాప్ ల‌పై కేంద్రం తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది.అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై.

కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జరిగింది.దీనిలో భాగంగా చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

అదేవిధంగా లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

పరారీలో సినీ నటి కస్తూరి శంకర్… గాలిస్తున్న పోలీసులు?