డీప్ ఫేక్‎పై కేంద్రం సీరియస్..!

డీప్ ఫేక్‎పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.ప్రస్తుత సమాజానికి డీప్ ఫేక్‎ కొత్త ప్రమాదంగా మారిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

డీప్ ఫేక్‎పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అశ్వని వైష్ణవ్ తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియా ప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా డీప్ ఫేక్‎పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల వినియోగదారుల నుంచి, నిపుణుల నుంచి సలహాలు స్వీకరించామని పేర్కొన్నారు.

అలాగే డీప్ ఫేక్‎ విషయంలో నాలుగు అంశాలపై పని చేయాల్సిన అవసరం ఉందన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అదేవిధంగా డీప్ ఫేక్ నియంత్రణకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి7, మంగళవారం 2025