Arjun Munda : రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం..: కేంద్రమంత్రి అర్జున్ ముండా

రైతులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అర్జున్ ముండా ( Union Minister Arjun Munda )అన్నారు.

ఈ మేరకు మరోసారి చర్చలకు రైతులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.ఎంఎస్పీ, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై చర్చించడానికి సిద్ధమని పేర్కొన్నారు.

అదేవిధంగా గత ఆందోళనలో రైతులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఎత్తివేతపై కూడా చర్చిస్తామని ఆయన తెలిపారు.

శాంతి నెలకొనాలంటే చర్చలు చాలా ముఖ్యమని కేంద్రమంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు.

అయితే గత తొమ్మిది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు ఇవాళ మరోసారి ఢిల్లీ ( Delhi )చలోకి సిద్ధమంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

రైతుల ఆందోళనల నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.

హీరోగానే ఉండిపోవాలని శోభన్ బాబు రిజెక్ట్ చేసిన రోల్స్ ఇవే.. ఇంత మంచి పాత్రలు వదులుకున్నారా?