బీఆర్ఎస్ ను కేంద్రం కాపాడుతోంది..: రేవంత్ రెడ్డి
TeluguStop.com
బీఆర్ఎస్ పార్టీని కాపాడటానికే కేంద్రం కాపాడుతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
నాణ్యతాలోపం వలనే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయిందని ఆరోపించారు.బొగ్గు గనులు ఉన్న ప్రాంతంలో సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
బాంబులు పెట్టి ఉంటే బ్రిడ్జి కూలేది, పిల్లర్ కుంగదని చెప్పారు.ఎల్ అండ్ టీపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
డ్యాం సేప్టీ అధికారుల నివేదికను కేంద్రం ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈఎన్సీ మురళీధర్ రావును అడ్డు పెట్టుకొని దోపిడీ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
నా భర్త అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!