వృద్ధులకు కేంద్రం భారీ షాక్.. రైల్వే టికెట్లపై రాయితీకి మంగళం

సీనియర్ సిటిజన్లు, క్రీడాకారులకు ఇచ్చే రైల్వే టిక్కెట్లపై రాయితీలను పునరుద్ధరించేది లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఎందుకంటే రాయితీల మంజూరు ఖర్చు రైల్వేలపై భారీగా ఉంటుందని తెలిపింది.చాలా తరగతుల్లో ప్రయాణీకుల ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది.

వాటికి తోడు వివిధ వర్గాల ప్రయాణికులకు రాయితీల కారణంగా భారతీయ రైల్వేలో ప్రయాణీకుల విభాగం భారీ నష్టాన్ని చవిచూస్తోందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

ప్రయాణీకుల సేవలకు తక్కువ ఛార్జీల నిర్మాణం కారణంగా సీనియర్ సిటిజన్లతో సహా ప్రయాణీకులందరికీ సగటున ప్రయాణ ఖర్చులో 50 శాతం కంటే ఎక్కువ భారతీయ రైల్వే ఇప్పటికే భరిస్తోందని మంత్రి వాదించారు.

ఇది కాకుండా, కోవిడ్-19 కారణంగా, 2019-2020తో పోల్చితే గత రెండేళ్లుగా ప్రయాణీకుల ఆదాయాలు తక్కువగా ఉన్నాయని వివరించారు.

రాయితీలు రైల్వేల ఆర్థిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

రాయితీల మంజూరు ఖర్చు రైల్వేలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీనియర్ సిటిజన్‌లతో సహా అన్ని వర్గాల ప్రయాణికులకు రాయితీల పరిధిని విస్తరించడం మంచిది కాదని ఆయన అన్నారు.

అయితే ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, భారతీయ రైల్వే నాలుగు వర్గాల వికలాంగులకు, పదకొండు వర్గాల రోగులు, విద్యార్థులకు ఛార్జీల రాయితీని కొనసాగించిందని మంత్రి తెలిపారు.

టికెట్ రాయితీలు 50 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం గతంలో రైల్వే శాఖ ఇచ్చేది.

అయితే రెండేళ్ల క్రితం కోవిడ్ సందర్భంగా రాయితీలు తొలగించింది.

నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది అంటూ ఎన్టీఆర్ ట్వీట్..