ఇక గుడిలో పూజారి బదులు యంత్రమే తీర్థం అందజేస్తుందేమో …?

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ని అరికట్టడానికి ఐదుసార్లు లాక్ డౌన్ పొడిగిస్తూ వచ్చింది.

అయితే ఈ ఐదోసారి విధించిన లాక్ డౌన్ లో అనేక సడలింపులు లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి.

కానీ భక్తుల్లో ఏదో ఒక మూలన ఆందోళన మాత్రం అలాగే ఉంది.అసలు విషయంలోకి వెళ్తే.

అందరూ కొట్టే గంటను ముట్టుకుంటే వైరస్ వస్తుందా .? పూజారి ఇచ్చే తీర్థం ద్వారా కరోనా వస్తుందేమో .

? లాంటి విషయాలు చాలా మందికి ఉన్నాయి.ఈ నేపథ్యంలో మంగళూరుకు చెందిన ప్రొఫెసర్ తీర్థ డిస్పెన్స్రర్ అనే కొత్త యంత్రాన్ని కనుగొన్నారు.

ఆ యంత్రం తో పూజారి తో పనిలేకుండా యంత్రమే స్వయంగా తీర్థాన్ని అందజేస్తుంది.

ఇకపోతే ఈ యంత్రానికి పక్కన ఉంచిన బిందెలో పూజారి కేవలం అందులో తీర్థం పోస్తే చాలు.

ఆ యంత్రమే భక్తులందరికీ తీర్థాన్ని అందజేస్తుంది.వినడానికి విడ్డూరంగా ఉన్నా కానీ ఇది నిజం.

"""/"/ ఇందుకుగాను భక్తులు ఆ యంత్రం కింద చేతులు పెడితే చాలు.తీర్థం దానికి అదే వారి చేతుల్లోకి వచ్చేస్తుంది.

దీనికి కారణం ఆ యంత్రంలో పెట్టిన సెన్సార్స్.సెన్సార్ తో పనిచేసే ఈ యంత్రం కేవలం రూ.

2700 ఖర్చు అయిందని తెలియజేస్తున్నారు.ఇకపోతే కొన్ని రోజుల క్రితం సెన్సార్ తో పనిచేసే గంటను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ విదితమే.

ఇక అతి కొద్దికాలంలోనే ఇలాంటి ఆవిష్కరణలు మనకు ఆలయాల్లో కనిపించబోతున్నారు.ఇలాంటివి ఉంటే గుడిలో కరోనా మహమ్మారి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోవచ్చు భక్తులు.

పవన్ ట్వీట్ కు తారక్ అందుకే రిప్లై ఇవ్వలేదా.. ఆ రీజన్ వల్లే సైలెంట్ అయ్యారా?