ఆ హీరోలపై షాకింగ్ కామెంట్లు చేసిన సినీ సెలబ్రిటీస్.. ఎవరంటే..?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు.చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ( Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh )లాంటి వాళ్లు అన్నదమ్ముల్లాగా మెలిగే వారు.
కానీ వీరికి ముందు, వీరి తరువాత వచ్చిన కొందరు హీరోలు మాత్రం ఇతర స్టార్ హీరోలను దారుణంగా టార్గెట్ చేశారు.
ముఖ్యంగా ఇటీవల కాలంలోనే కొందరు సినీ సెలబ్రిటీలు వేరే హీరోలపై షాకింగ్ కామెంట్లు చేశారు.
అయితే వాళ్లు డైరెక్ట్ అటాక్ చేయకుండా ఇన్‌డైరెక్ట్‌గా ఆ వ్యాఖ్యలు చేశారు.వారెవరో తెలుసుకుందాం.
"""/" /
H3 Class=subheader-style• పవన్ కళ్యాణ్:/h3p
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.
అందుకే కొద్ది రోజుల క్రితం ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లారు.కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మీట్ అయ్యారు.
తర్వాత విలేకర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్( Allu Arjun ) పై విమర్శలు చేశారు.
"ఒకప్పటి సినిమాల్లో హీరోలు అడవులను కాపాడితే ఇప్పటి చిత్రాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు.
పరిస్థితి అలా తయారైంది" అని పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.ఇన్‌డైరెక్ట్‌గా పవన్ బన్నీపై విమర్శలు చేశారని అందరూ అనుకుంటున్నారు.
ఇటీవల కాలంలో బన్నీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది.
పవన్ దానికి ఆజ్యం పోశారు. """/" /
H3 Class=subheader-style• నాగ్ అశ్విన్:/h3p
నాగ్ అశ్విన్( Nag Ashwin ) కల్కి 2898AD సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఇందులోని కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి.ఈ మూవీ కొన్ని రోజుల్లోనే రూ.
1,000 కోట్లు సంపాదించి నాగ్ అశ్విన్ ను గొప్ప డైరెక్టర్ గా మార్చేసింది.
అయితే ఈ ఫీట్ సాధించిన సందర్భంగా నాగ్ అశ్విన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ వంగారెడ్డిపై( Sandeep Reddy ) పరోక్షంగా కామెంట్స్ చేశాడు.
తమ సినిమా ఎక్కడా రక్తపాతం, అశ్లీలత లేకుండా 1,000 కోట్లు కలెక్ట్ చేయగలిగిందని, అందువల్ల ఎంతో ఆనందంగా ఉందని నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు.
డైరెక్టర్ సందీప్ వైయలెన్స్, రొమాంటిక్ సీన్లతో వేల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు, కానీ మేము అలాంటివి లేకుండా ఆ ఘనత సాధించామన్నట్లు నాగ్ అశ్విన్ మాట్లాడారని నెటిజన్లు ఆరోపించారు.
"""/" /
H3 Class=subheader-style• రామ్ గోపాల్ వర్మ/h3p
ఒక స్టార్ హీరో తన సినిమాలను థియేటర్లలో బలవంతంగా ఎక్కువ రోజులు ఆడించుకుంటున్నాడని కాంట్రవర్షల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Director Ram Gopal Varma
) ఇటీవల సంచలన కామెంట్లు చేశారు.
అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం తెలపలేదు.
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?