Mansoor Ali Khan : హీరోయిన్స్ పై కామెంట్స్..ఇది మెంటల్ సిక్నెస్ జబ్బు..బాగా ముదిరిపోయింది..!

తాజాగా హీరోయిన్ త్రిష పై నటుడు మన్సూర్ అలీ( Mansoor Ali Khan ) చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి.

ఆమెను రేప్ చేసే అవకాశం లియో చిత్రంలో రాలేదు అంటూ అతను చేసిన వ్యాఖ్యలకంటే, తరువాత అతను క్షమాపణ చెప్పిన విధానం ప్రేక్షకులకు ఆగ్రహం కలిగించింది.

అది క్షమాపణ కంటే వెటకారం అంటే సరిపోతుందేమో.ఒక స్టార్ హీరోయిన్ పై ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కామెంట్ చేసాడు కాబట్టి ఈ విషయం ఇంతటి వివాదానికి దారితీసింది.

కానీ లోతుగా ఆలోచిస్తే, ఆడవారిపై సినీ రంగంలో వివక్ష ఎప్పటినుంచో ఉంది.ఇప్పటికి కొనసాగుతుంది కూడా.

గతంలో ఇటువంటి వివాదాలు చాలానే జరిగాయి. """/" / ఉదాహరణకి.

బాలకృష్ణ( Balakrishna ) వివాదాన్నే తీసుకోండి.సావిత్రి చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమంలో బాలకృష్ణ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసాయి.

సినిమాలో తాను కేవలం హీరోయిన్ వెనుక తిరిగితే తన ఫాన్స్ సొంతోషించరని, వాళ్ళకి ముద్దు పెడితేనో, ప్రెగ్నెంట్ చేస్తేనో తప్ప వాళ్ళకి నచ్చదని అందుకే తాను కూడా హీరోయిన్లను గిచ్చడం, గిల్లడం వంటి చిలిపి పనులు చూస్తుంటానని అన్నారు.

"""/" / ఒక స్టార్ హీరో అయ్యుండి, ఒక గొప్ప చరిత్ర గల కుటుంబం నుండి వచ్చిన ఒక పెద్ద మనిషి ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం తట్టుకోలేపపోయారు ప్రేక్షకులు.

కొన్నాళ్ల క్రితం నాగ చైతన్య హీరోగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం ఆడియో ఫంక్షన్ లో సీనియర్ నటుడు చలపతి రావు( Chalapathi Rao ) అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరమే కానీ పక్కలోకి పనికొస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా అందర్నీ కాస్త ఇబ్బంది పెట్టాయి.

ఒక సీనియర్ నటుడు ఇటువంటి కామెంట్స్ చెయ్యడం సరి కాదంటూ నిద్ర లేచాయి మహిళా సంఘాలు.

ఇక మన ఆడియో ఫంక్షన్లలో, సక్సెస్ మీట్ లలో, అవార్డు ఫంక్షన్ లలో హీరోయిన్ ల, తొడల పైన, నడుము పై కామెంట్స్ చాలా కామన్.

ఇవన్నీ పబ్లిక్ ఈవెంట్స్ లో జరిగిన సంఘటనలు కాబట్టి బయటకు వచ్చాయి.ఇంకా లోలోపల ఎంత మంది హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇటువంటి సెక్సిస్టు కామెంట్స్ ని ఎదుర్కొని ఓర్చుకుంటున్నారో, ఆ దేవుడికే తెలియాలి.

ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు వీళ్ళకేమైనా మానసిక రోగం ఉందా? అన్న సందేహం కలుగుతుంటుంది.

కానీ ఏం చేస్తాం.మన సినిమా రంగ అలా ఏడ్చింది మరి.

!.

షాకింగ్ వీడియో: కనురెప్ప పాటులో తల్లిబిడ్డలను పొట్టన పెట్టుకున్న కారు..