చనిపోయానంటు సెలబ్రిటీ నాటకం.. చివరకి..?!
TeluguStop.com
చాలామంది సరదాగా చేసే పనులు సంతోషం తెప్పించినా కొన్నిసార్లు అవే కొంపకొల్లేరు చేస్తాయి.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.ముంబైకి చెందిన ఇఫ్ఫీ ఖాన్ అనబడే ఇర్ఫాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీగా పేరుపొందాడు.
అయితే అతను సరదాగా చేసిన ఓ పని అతన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లేలా చేసింది.
సాధారణంగా ఎవరినైనా ప్రేమిస్తే ఆ అమ్మాయి ఇష్టపడితేనే ఆ ప్రేమ సక్సెస్ అవుతుంది.
కానీ ఇక్కడొక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే చనిపోయాల్సిందే అంటూ ఓ వీడియో చేశాడు.
ఆ వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్సు ఉండటంతో ఈ వీడియోను చూసిన వారంతా ఖంగు తిన్నారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో స్థానికంగా ఉండే బాంద్రా పోలీసులకు ఆ విషయం తెలిసింది.
పోలీసులు ఈ విషయంలో కలగజేసుకుని ఇర్ఫాన్ ఖాన్ పై కేసు నమోదు చేశారు.
ఆ వైరల్ అయిన వీడియోపై దర్యాప్తును ప్రారంభించారు. """/"/
వీడియోలో ఇర్ఫాన్ ఖాన్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు.
అయితే ఆ అమ్మాయి అతన్ని ప్రేమించదు.దీంతో తీవ్ర మనస్తాపం వ్యక్తం చేసిన ఇర్ఫాన్ ఖాన్ దగ్గరల్లోని రైల్వే స్టేషన్ కి వెళ్లి పట్టాలపైన కూర్చుంటాడు.
ఆ తర్వాత వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొడుతున్నట్లుగా ఆ తర్వాత ఇర్ఫాన్ ఖాన్ చనిపోయినట్లుగా వీడియో ఎడిట్ చేశాడు.
ఈ వీడియోను షేర్ చేయడంతో అతను నిజంగానే చనిపోయాడేమోనని చాలా మంది అనుకున్నారు.
ఫాలోవర్లు విపరీతంగా ట్విట్టర్ లో ఈ వీడియోను రీట్వీట్ చేశారు.ఈ వీడియోపై చాలా మంది కామెంట్లు చేశారు.
అందులో కొందరు నెటిజన్లు ముంబై పోలీసులకు కూడా ఈ వీడియోను ట్యాగ్ చేయడంతో పోలీసులు ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ని కటకటాలపాలు చేశాడు.
భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 505 (1) కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
చివరికి అతని వీడియోను పోలీసులు డిలీట్ చేశారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మరో భారీ షాక్.. ఊహించని నష్టాలు తప్పవా?