లండన్ అక్షయపాత్ర కిచెన్‌లో సెలబ్రెటీ చెఫ్ సంజీవ్ కపూర్ సందడి
TeluguStop.com
సెలబ్రెటీ చెఫ్ సంజీవ్ కపూర్ ( Chef Sanjeev Kapoor)ఇటీవల భారత్, యూకేలలో 2.
25 మిలియన్ల మంది పిల్లలకు ఆహారం అందించే అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు (Akshaya Patra's)చెందిన లండన్ కిచెన్‌ని సందర్శించారు.
లండన్‌కు ఉత్తరాన వాట్‌ఫోర్డ్‌లో ఉన్న అక్షయపాత్ర కిచెన్ లక్షలాది మంది పిల్లల ఆకలిని తీరుస్తోంది.
M
గత వారం యూకేలో పర్యటించిన సంజీవ్ కపూర్(chef Sanjeev).అక్షయ పాత్రకు చెందిన చెఫ్‌ల బృందంతో భేటీ అయి వివిధ రకాల వంటకాలు, ఆహారాన్ని తయారు చేయడానికి తగిన సూచనలు అందజేశారు.
ఈ సందర్భంగా సాస్, సీజనల్ వెజిటేబుల్స్‌తో కలర్‌ఫుల్ పాస్తా డిష్‌ను తయారు చేసి వడ్డించాడు.
భారత సంతతి స్వచ్ఛంద సంస్థకి చెందిన అంతర్జాతీయ కిచెన్‌ని సందర్శించడం నా జీవితంలో ఓ మరుపురాని అనుభూతిగా సంజీవ్ కపూర్ తెలిపారు.
ఇది మిలియన్ల మంది పిల్లలకు వారి విద్యకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు.యూకేలో పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని సంజీవ్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్న అక్షయపాత్ర(Akshaya Patra) బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
"""/" /
ఫుడ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపిన గణాంకాల ప్రకారం.
యూకేలో (UK)దాదాపు 4 మిలియన్ల మంది పిల్లలు ఆహార భద్రతతో బాధపడుతున్నారని తెలిపారు.
అయితే ఒక్క లండన్‌లోనే 4,26,500 మంది పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారని చైల్డ్ హుడ్ ట్రస్ట్ అనే మరో ఎన్జీవో అంచనా వేసింది.
అక్షయపాత్ర సంస్థ.హాట్ మీల్స్ అండ్ హోంవర్క్ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో భోజనాన్ని అందిస్తుంది.
"""/" /
అక్షయ పాత్ర యూకే అనేది నమోదిత ఛారిటీ సంస్థ .
2020 వరకు భారతదేశంలో సామాజిక కార్యక్రమాల కోసం యూకేలో ఫండ్ రైజింగ్ నిర్వహించింది.
అయితే యూకేలో నానాటికీ పెరుగుతున్న ఆహార భద్రత, పౌష్టికాహార లోపం నేపథ్యంలో దాతలు, ఇతర స్వచ్ఛంద సంస్థల మద్ధతుతో ఈ దేశంలో ఎంతో మంది పిల్లలకి ఆహారాన్ని అందిస్తోంది.
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్