బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు హాజరు కాని సెలబ్రిటీల జాబితా ఇదే.. ఎవరెవరంటే?
TeluguStop.com
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Natasinham Balakrishna )గురించి అందరికీ తెలిసిందే.
బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా తాజాగా తెలుగు సినీ పరిశ్రమ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకలకు స్టార్ హీరోలైన చిరంజీవి వెంకటేశ్వర తో పాటు చాలామంది యంగ్ హీరోలు సైతం హాజరైన విషయం తెలిసిందే.
నటీమణులు కూడా హాజరయ్యారు.కానీ ఈ వేడుకలో అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )మాత్రం ఎక్కడా కనిపించలేదు.
"""/" /
తెలుగు సినిమా పరిశ్రమ తరపున ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందడంతో పాటు ముఖ్య అతిథుల జాబితాలో ఆయన పేరు ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు.
నాగార్జున తప్పకుండా హాజరవుతారని అక్కినేని అభిమానులు కూడా ఆచరించారు.కానీ ఊహించని విధంగా ఆయన రాకుండా అందరికీ షాక్ ఇచ్చారు.
అయితే నాగార్జున రాకపోయినప్పటికీ ఆయన కుమారులైన అఖిల్( Akhil ) లేదా నాగచైతన్యలు( Naga Chaitanya ) తప్పకుండా వస్తారు అని అందరూ భావించారు.
కానీ వారు కూడా రాకపోయేసరికి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. """/" /
అలాగే నందమూరి వారసులు, అన్నద మ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ( Kalyan Ram, Jr.
NTR )కూడా బాబాయ్ ఈవెంట్ కి హాజరవుతారని భావించారు.కానీ వాళ్లు కూడా రాలేదు.
తారక్ కర్ణాటక దేవాలయాల ప్రదర్శనలో ఉండటంతో అటెండ్ కానట్లు తెలుస్తోంది.కల్యాణ్ రామ్ బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కానట్లు అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఏపీ ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ( Nara Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan, Minister Lokesh )కూడా హాజరవుతారని భావించారు.
వాళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.కానీ ఏపీలో భారీ వర్షాలతో రాజధాని అమరావతి, గుంటూరు ప్రాంతాలు మునిగి పోవడంతో వాళ్లు హాజరు కాలేకపోయారు.
వీరీతోపాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు హాజరు కాలేదు.
ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలివే.. రికార్డులు క్రియేట్ అయ్యయిగా!