2020లో టాలీవుడ్‌కి దూరమైన సెలబ్రెటీలు వీళ్ళే!

2020 కరోనా వైరస్ వల్ల పూర్తిగా ఆగిపోయింది.ఇక సినిమాలు అయితే కనీసం 50 కూడా ఈ సంవత్సరం విడుదల అవ్వలేదు.

ఈ ఏడాది మొత్తం ఆగిపోయింది.ఇంకా అలాంటి ఈ సంవత్సరంలో టాలీవుడ్ జీర్ణించుకోలేని విధంగా కొన్ని ఘటనలు జరిగాయ్.

కొందరు మన సినీ సెలబ్రెటీలు ఊహించని రీతిలో మృతి చెంది షాక్ కి గురి చేశారు.

వారు లేని టాలీవుడ్ ని ఇప్పటికి ఊహించలేకపొతున్నారు.ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన నుంచి దూరం అయ్యారు.ఆగష్టు 5వ తేదీన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతూ సెప్టెంబర్ 25వ తేదీన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.

2020 ఈ లెజండరీ సింగర్ ని మన నుంచి దూరం చేసింది. """/"/ జయ ప్రకాష్ రెడ్డి.

రాయలసీమ యాసతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి సెప్టెంబర్ నెలలో కన్నుమూశారు.

సెప్టెంబర్ 8వ తేదీన తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములోనే కుప్పకూలిపోయారు.74 ఏళ్ళ వయసు వచ్చిన ఆయనకు నటనపై ఉన్న ఇష్టంతో ఈ ఏడాది కూడా నటించారు.

సరిలేరు నీకెవ్వరూ సినిమా అయన నటించిన చివరి చిత్రం.కోసూరి వేణుగోపాల్.

ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ సైతం కరోనా వైరస్ కు బలయ్యారు.టీవీ, సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించినా కోసూరి వేణుగోపాల్ కరోనా వైరస్ బారిన పడి దాదాపు 22 రోజులు పాటు చికిత్స తీసుకున్న అయన సెప్టెంబర్ 23వ తేదీన మృతి చెందారు.

"""/"/ శ్రావణి కొండపల్లి.సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈమె సెప్టెంబర్ 8వ తేదీన ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లి విషయంలో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకుంది.ఈమె సూసైడ్ కేసులో దేవరాజ్, సాయికృష్ణ అనే ఇద్దరితో పాటు ఆర్ఎక్స్ 100 సినీ నిర్మాత కూడా అరెస్ట్ అయ్యాడు.

"""/"/ రావి కొండలరావు.ఎన్నో వందల సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు రావి కొండలరావు.

1958 నుంచి ఈయన సినీ పరిశ్రమలోనే ఉన్నారు.అలాంటి ఈ నటుడు అనారోగ్యంతో ఉన్న అయన గుండెపోటుతో జులై 28వ తేదీన మృతి చెందారు.

ఇలా 2020లో ఇంతమంది స్టార్ సెలబ్రెటీలు మృతి చెందారు.

కెనడా గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్.. వీడియో వైరల్..