అమ్మతనం ఒక అంగడి సరుకా..? ఎందుకు ఈ దిగజారుడు అర్ద నగ్న ఫోటో షూట్స్ ?
TeluguStop.com
ఆధునికత పోకడలు మనిషిలోని విజ్ఞానాన్ని చంపేసి అజ్ఞానాన్ని పెంచుతున్నాయి.ప్రతి పని పక్క వారి కన్నా గట్టిగ చేయాలనో లేదంటే అందరికి తెలిసేలా చేయాలనో ఈ తరం సెలబ్రిటీలు కోరుకుంటున్నారు.
అది చిన్న స్క్రీన్ అయినా పెద్ద స్క్రీన్ అయినా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు చేస్తునం పైత్యపు పనులు చూస్తుంటే వారిని అనుసరించే వారి కన్నా కూడా అసహ్యించుకునే వారు ఎక్కువ.
మరి ఈ మధ్య అయితే అమ్మతనం కూడా అంగడి సరుకుగా మారిపోతుంది.కేవలం అందాల ఆరబోతత తో అంగాంగ ప్రదర్శన తో కేవలం ఫోటోషూట్ కోసమే పిల్లలను కన్నట్టుగా మారిపోతుంది సమాజపు పోకడ.
బేబీ బంప్ ల ఫోటో షూట్ ఒక ట్రేండింగ్.తూచా తప్పకుండ చేసే ఒక తంతులా మారింది.
వీటిని కొందరు ఆహా ఓహో అంటూ మెచ్చుకుంటుంటే కొంత మంది ఈసడించుకుంటూ వెళ్ళిపోతారు.
9 నెలల కడుపును చీర చాటు కు ఎక్కడ దిష్టి తాకుతుందో అని మొన్నటి వరకు అమ్మలు దాచుకునే వారు.
చివరికి పాలు ఇచ్చిన కూడా పై నుంచి ఏదైనా వేసుకుంటారు.కానీ ఇప్పుడు ఆలా కాదు.
అర్ద నగ్న ప్రదర్శన కోసం మాత్రమే అన్నట్టుగా కడుపు కనిపించేలా ఫోటోలు తీయడం అవి సోషల్ మీడియాలో పెట్టడం బాగా అలవాటయ్యింది.
ప్రతి సెలెబెర్టీ ఈ ఆన్లైన్ చట్రం లో ఇరుక్కుంటున్నారు.ఇక హీరోయిన్స్ అయితే బేబీ బంప్ ల తో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.
"""/"/
నిన్నటికి నిన్న బ్రహ్మాస్త్ర సినిమా కోసం అలియా భట్ ఇలాగె చేసి బాగా ప్రమోషన్ పెంచుకుంది.
కొన్ని సార్లు ఈ అమ్మాయి ఎంతో ఎడ్డీ పిల్ల అని అనుకున్నాం కానీ ఆమె బేబీ బంప్ ఎక్కడ కనిపించకుండా ఆసాంతం ప్రమోషన్స్ చేసుకొని వెళ్ళిపోయింది.
ఇక యూట్యూబ్ కి వస్తే మహా దరిద్రం బాబోయ్ .డబ్బుల కోసమే పిల్లలను కన్నట్టు గా పిల్ల కడుపులో పడింది మొదలు ప్రతి రోజు సర్ప్రైస్స్ అంటూ వీడియోస్ తీయడం అవి జనాల పైన రుద్దడం.
మహా దారుణం అయిపొయింది వీరి పోకడ.పైగా డబ్బుకు డబ్బు, పేరు కు పేరు.
ఫెడ్ అవుట్ అయిపోయిన వారు కూడా యూట్యూబ్ తో బ్రతికేస్తున్నారు.
వామ్మో.. ఇలాంటి గుడ్లు తినేముందు జాగ్రత్త సుమీ.!