ఘనంగా డాక్టర్ సి.నారాయణ రెడ్డి 92వ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నృత్య కళానికేతన్ సేవాసంస్థ, జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో సినారె 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ముందుగా కళాకారులందరూ కలిసి జ్ఞానపీఠపురస్కార గ్రహీత డా! సి.నారాయణరెడ్డి( Dr.

C.Narayana Reddy ) చిత్రపటానికి పుష్పాంజలితో ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా సినారె రాసిన గేయాలను ఆలపించగా అనంతరం కళాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు యెల్ల పోశెట్టి మాట్లాడుతూ హనుమాజీపేట ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు, అలాగే వేములవాడ నృత్య కళానికేతన్ సేవాసంస్థ గౌరవ ముఖ్య సలహాదారులు డాక్టర్ సి.

నారాయణరెడ్డి 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.హనుమాజీపేటలోని గ్రామ చివరన ఉన్న డా!! సినారె విగ్రహాన్ని బస్టాండ్ ఆవరణలో నెలకొల్పుటానికి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు,పుర ప్రముఖులు సహకరించగలరని కోరారు .

ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు బొడ్డురాములు, సమాఖ్య అధ్యక్షులు సావనపల్లి శ్రీనివాస్,సేవాసంస్థ అధ్యక్షులు మానువాడ లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శులు వారాల దేవయ్య, వెంపటి సంతోష్ కుమార్ కనపర్తి హనుమాన్లు, గణాచారి సాంబశివు, కేశన్న రాధిక శ్రీకాంత్, ముత్తోజు రమేష్ చారి, విక్కుర్తి లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయులు,పులి సంపత్ గౌడ్ వెదిరెరవి, వెదిరెగణేష్ మిద్దె వినీత్, గుమ్మడి రాజేశం గౌడ్, అన్నారం హరీష్, కనికరపు అనిల్ మామిండ్ల సత్తయ్య కళాకారులు పాల్గొన్నారు.

భారతీయుల రక్తంతో తడిసిన ఉక్రెయిన్.. రష్యా తరపున పోరాడుతూ 12 మంది ఇండియన్స్ దుర్మరణం!