ఏపీ సీఎస్, డీజీపీకి సీఈసీ సమన్లు..!

ఏపీ సీఎస్ మరియు రాష్ట్ర డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) సమన్లు ఇచ్చింది.

ఈ మేరకు ఢిల్లీకి వచ్చి సీఎస్, డీజీపీ వివరణ ఇవ్వాలని సీఈసీ సమన్లలో పేర్కొంది.

ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు,( Palnadu ) చంద్రగిరి( Chandragiri ) సహా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే పోలింగ్ రోజు నుంచి ఇప్పటివరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీగా మోహరించారు.

వీడియో: డబ్బాలో తల ఇరుక్కుని హిమాలయన్ ఎలుగుబంటి విలవిల.. రక్షించిన ఇండియన్ ఆర్మీ..