తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా సీఈసీ ఇవాళ హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించింది.
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరియు కమిషనర్లతో సీఈసీ భేటీ అయింది.ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పోలింగ్, భద్రతతో పాటు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణపై సీఈసీ రాజీవ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
అదేవిధంగా ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.
నిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించిన సీఈసీ ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయింది.
అదేవిధంగా రేపు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ తో భేటీ కానుంది.
అనంతరం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
చిత్తూరులో కాల్పుల కలకలం.. వ్యాపారిని టార్గెట్ చేసిన దొంగల ముఠా