ఏసీబీ కోర్టు ఎదుటకు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు..!!

హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును( CCS ACP Umamaheswara Rao ) ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఈ మేరకు ఆయనను ఏసీబీ కార్యాలయం నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఉస్మానియా ఆస్పత్రిలో( Osmania Hospital ) ఏసీపీ ఉమా మహేశ్వర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చనున్నారు.కాగా ఇవాళ ఏసీబీ కార్యాలయంలో విచారణ కొనసాగగా.

ఉమామహేశ్వర రావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు( ACB Officials ) చెబుతున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ ఉమామహేశ్వర రావు నివాసం సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ దాడుల్లో భారీగా నగదుతో పాటు బంగారం, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

బీఆర్ఎస్ఎల్పి విలీనం దిశగా రేవంత్ స్కెచ్ ?