హైదరాబాద్: సీసీఎస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ లో( Hyderabad ) ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి.ఈ మేరకు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు( CCS ACP Uma Maheswar Rao ) నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ( ACB ) తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉన్న ఇంటితో పాటు ఆరు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.

కాగా సాహితి ఇన్ ఫ్రా కేసులో ఉమా మహేశ్వర్ రావు విచారణ అధికారిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

కారులో డ్యాన్స్ చేస్తూ డ్రైవ్ చేసిన మహిళ.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి దిమ్మతిరిగింది..