నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి

ముదిరాజ్ కమ్యూనిటీ హాల్లోసీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్సై.రాజన్న సిరిసిల్ల జిల్లా: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి( Shekhar Reddy ) తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం ముస్తాబాద్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది.

అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిధిలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలనీ, వాణిజ్య వ్యాపార సముదాయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే ఎంతో మంచిదని అన్నారు.

ప్రజల రక్షణ కొరకు తమ విధులను నిర్వహిస్తున్నామని శాంతి భద్రతలకు కూడా మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని , సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

తప్పు ఎవరు చేసిన అప్పుడు ఇప్పుడు బలయ్యింది సమంత నే కదా !