కళ్లు కోల్పోయినా స్కూల్ టాపర్.. ఐఏఎస్ దిశగా అడుగులు.. ఈ విద్యార్థిని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా వేర్వేరు కారణాల వల్ల లక్ష్య సాధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

కళ్లు లేనివాళ్లు( Blind ) నిత్య జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మూడేళ్ల వయస్సులోనే కళ్లను కోల్పోయిన కఫి( Kafi ) సీ.బీ.

ఎస్.ఈ పరీక్షల్లో టాపర్ గా నిలిచారు.

యాసిడ్ దాడిలో చూపు కోల్పోయిన కఫి బలమైన లక్ష్యం ఉంటే సక్సెస్ దక్కుతుందని ప్రూవ్ చేశారు.

పదో తరగతి సీ.బీ.

ఎస్.ఈ( CBSE ) పరీక్షల్లో 95.

2 శాతం మార్కులను సాధించిన కఫి సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేము.

మూడేళ్ల వయస్సులో పక్కింటి వ్యక్తి కఫిపై ఆసిడ్ దాడి చేశాడు.సచివాలయంలో ప్యూన్ గా పని చేస్తున్న తండ్రి పవన్ ఎన్నో ఆస్పత్రులలో కూతురిని చూపించినా ఫలితం లేకుండా పోయింది.

చంఢీగడ్ కు( Chandigarh ) చెందిన కఫి ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేసి కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.

"""/" / బ్రెయిలీ లిపిలో( Braille ) చదవడం మొదలుపెట్టిన కఫి తల్లీదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించారు.

ప్రత్యేక అవసరాలు ఉన్న ఎంతోమంది విద్యార్థులకు ఆమె ప్రేరణగా నిలిచారు.ఐఏఎస్ ఆఫీసర్( IAS ) కావడం తన లక్ష్యమని చెబుతున్న కఫి రాబోయే రోజుల్లో లక్ష్యాన్ని కూడా సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

తల్లీదండ్రులు, ఉపాధ్యాయులు సహాయసహకారాలు అందించడం వల్లే తాను సక్సెస్ అయ్యానని ఆమె చెబుతున్నారు.

"""/" / కొన్ని పాఠ్యాంశాలను యూట్యూబ్ ద్వారా విని ప్రిపేర్ అయ్యానని ఆమె చెబుతున్నారు.

కఫి తమ కూతురు అయినందుకు గర్వపడుతున్నామని కఫి లక్ష్యానికి సహాయసహకారాలు అందిస్తామని తల్లీదండ్రులు చెబుతున్నారు.

సక్సెస్ తో తన కూతురు తమను సమాజంలో తలెత్తుకునేలా చేసిందని వాళ్లు వెల్లడిస్తున్నారు.

కఫి భవిష్యత్తులో మరింత సక్సెస్ సాధించడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

వీడియో వైరల్: ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?