ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్
TeluguStop.com
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
దాదాపు పది వేల పేజీలతో దాఖలైన ఈ ఛార్జ్‌షీట్ లో బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ పేర్లను సీబీఐ పేర్కొంది.
ఛార్జ్‌షీట్ లో సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్ పేర్లతో పాటు అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ పేర్లనూ సీబీఐ చేర్చింది.
లిక్కర్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, సౌత్ గ్రూప్ లావాదేవీలపై ఛార్జ్‌షీట్ దాఖలైంది.
ఈ క్రమంలో అధికారుల ప్రాసిక్యూషన్ కు సీబీఐ ప్రభుత్వ అనుమతి తీసుకుంది.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు లక్ కలిసిరావడం లేదా.. ఈ డైరెక్టర్ కు సమస్య ఇదేనా?