లాలూప్రసాద్ యాదవ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ..!
TeluguStop.com
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఇవాళ ప్రశ్నించనున్నారు.
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి లాలూను విచారించనున్నారు అధికారులు.అయితే లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్ మెంట్ లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీలో గ్రూప్ డీ సంబంధిత పోస్టులను అక్రమ దారిలో కట్టబెట్టినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రీదేవీ, కూతుళ్లు మీసా, హేమ పేర్లను చేర్చిన విషయం తెలిసిందే.
ఆ ఏరియాలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్లే రాలేదా.. అసలేం జరిగిందంటే?