ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో విచారణకు ఢిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది.

కేవలం వివరణ కోసమే సీబీఐ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.మరోవైపు సీబీఐ నోటీసులు అందాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఈనెల 6వ తేదీన తనను సీబీఐ అధికారులు కలవొచ్చని ఆమె వెల్లడించారు.కాగా ఇటీవల అరెస్ట్ చేసిన వ్యాపార వేత్త అమిత్ అరోరా రిమాండ్ లో కవిత పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

ఎయిర్ హోస్టెస్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్యాసింజర్.. ఆమె రియాక్షన్ చూస్తే..?