కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు..!
TeluguStop.com
కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయనకు అధికారులు నోటీసులు అందజేశారు.
పులివెందులలోని ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.
హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.అయితే ఈ కేసులో అవినాశ్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు విచారించింది సీబీఐ.
అంతేకాదు వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చిందని సమాచారం.ఈ మేరకు రేపు కడపలో భాస్కర్ రెడ్డిని విచారించనున్నారు.
మరోవైపు ఈనెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరగనుంది.